అమెరికాలోని పశ్చిమ వర్జీనియా ప్రాంతంలో ఐదేళ్ల క్రితం అదృశ్యమైన ఓ మూడేళ్ల చిన్నారి కేసులో ఆ పాప తల్లిని పోలీసులు తాజాగా అరెస్టు చేసి, పలు నిజాలు వెల్లడించారు. ఆలియా లన్స్‌ఫోర్డ్ అనే మూడేళ్ల తన పాప అదృశ్యమైందంటూ ఆమె తల్లి లినల్ లన్స్‌ఫోర్డ్ 2011 సెప్టెంబర్‌లో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి కోసం ఐదేళ్లుగా గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొందరిని విచారించినా పోలీసులకి ఆధారాలు లభించలేదు. పాప ఆచూకి తెలిపితే 20,000 డాలర్లను బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటన చేశారు.
ఆ పాప ఫోటోను తీసుకుని ఇప్పుడు ఈ వయసులో ఎలా వుంటుందో ఊహా చిత్రాలను రూపొందించి పోస్టర్లను విడుదల చేసినా పాప ఆచూకీ లభించలేదు. చివరకు పోలీసులకి ఆ చిన్నారి తల్లిపై అనుమానం వచ్చింది. ఆమెను విచారించగా చివరికి తన కూతురిని తానే చంపినట్లు ఒప్పుకుంది. తాను తన బిడ్డను తలపై పదునైన వస్తువుతో బలంగా కొట్టడంతోనే చనిపోయిందని చెప్పింది. ఐదేళ్ల పాటు పాప కోసం గాలించిన పోలీసులు చివరికి తల్లే ఆమె ప్రాణాలు తీసిందని తేల్చిచెప్పారు. లీనల్ లన్స్ఫోర్డ్ను అరెస్టు చేసిన పోలీసులు పాప మృతదేహం ఏమైందన్న విషయంపై విచారణ జరుపుతున్నారు.
ఆ పాపని కొట్టినప్పుడు తల్లి కవలపిల్లలతో గర్భవతిగా ఉంది. పాప కనిపించకుండా పోయిందంటూ కేసు పెట్టిన తర్వాత ఆమె.. సంక్షేమ నిధుల అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలతో ఓ కేసులోనూ నిందితురాలిగా ఉంది. భర్తతో గొడవలుపడి విడాకులు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆరుగురు పిల్లల తల్లి అయిన లినల్ లన్స్‌ఫోర్డ్ కు తల్లిగా ఆమెకున్న హక్కులను రద్దు చేస్తున్నట్లు అక్కడి న్యాయస్థానం ప్రకటించింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి