ఒక్క చాక్లెట్ పోగొట్టుకున్న ఓ యువకుడు అనంతరం కొన్ని రోజులకి 6,500 చాక్లెట్లను ఉచితంగా పొందిన సంఘటన అమెరికాలో ఇటీవలే చోటు చేసుకుంది. కన్సాస్ యూనివర్సిటీ విద్యార్థి అయిన హంటర్ జబిన్స్ కి చాక్లెట్లంటే చాలా ఇష్టం. ఆయన కొన్ని రోజుల క్రితం తన కారులో బయటకి వెళ్లాడు. అతడి కారులో కిట్‌క్యాట్ చాక్లెట్ ఉంది. అయితే, ఓ షాప్‌కి వెళదామనుకున్న జబిన్స్.. కారుని ఆ షాపు ముందు ఆపి డోర్‌లాక్ చేయకుండానే వెళ్లాడు.
ఇంతలో గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి కారులో ఉన్న చాక్లెట్‌ను చోరీ చేశాడు. అయితే, సదరు చాక్లెట్ దొంగ ఆ కారులో ఓ చీటి రాసిపెట్టి వెళ్లాడు. అందులో తనకు కిట్‌క్యాట్ చాక్లెట్ అంటే చాలా ఇష్టమని అంతేగాక, తాను ఆకలిగా ఉన్నానని పేర్కొన్నాడు. ఆ కారు డోర్ లాక్ వేయకపోవడంతో తాను అందులో ఉన్న చాక్లెట్‌ను తీసుకున్నానని, కారులోంచి వేరే వస్తువులేవీ తీసుకోలేదని రాశాడు. తన చాక్లెట్ చోరీకి గురైనందుకు మొదట కోపం తెచ్చుకున్న జబిన్స్ చోరీ చేసిన వ్యక్తి రాసిన చీటిని చూసి పోనీలే అనుకున్నాడు.
చాక్లెట్ దొంగ రాసిన చీటీని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఆ పోస్టు అంతర్జాలంలో చక్కర్లు కొట్టంది. చివరకు కిట్‌క్యాట్ చాక్లెట్ కంపెనీకి చేరింది. దీంతో సదరు కంపెనీ జబిన్స్కు ఒక్క చాక్లెట్‌కు బదులుగా 6,500 చాక్లెట్లను పంపించి ఆశ్చర్యపరిచింది. దీంతో ఎంతో హర్షం వ్యక్తం చేసిన ఆ యువకుడు చాక్లెటన్నింటినీ కారులో వేసుకొని తన యూనివర్సిటీకి వచ్చి, తన తోటి విద్యార్థులందరికి పంచి పెట్టాడు. ఒక్క చాక్లెట్ పోతేనేం వేలకొద్దీ చాకెట్లు వచ్చాయని మురిసిపోయాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి