ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఓ వ్యక్తి విసుగెత్తిపోయి తన పని పూర్తికాలేదంటూ పాకిస్థాన్ జెండా ఎగరవేశాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాను ఎంతో కాలంగా ప్రభుత్వానికి పన్ను కడుతున్నానని, అయితే తాను కట్టాల్సిన పన్ను కన్నా అధికంగా కడుతున్నానని నెహ్రూనగర్‌లోని సీసామావులో నివసించే చంద్రపాల్ సింగ్ అనే వ్యక్తి భావించాడు. కాన్పూర్ నగరపాలక సంస్థ అధికారులు ఇంటిపన్ను, నీటిపన్నులను తనతో కట్టించుకుంటున్నారని, తాను కడుతున్న పన్నులపై తనకు వివరణ ఇవ్వాలని, పన్ను గురించి కచ్చితంగా నిర్ధారించి చెప్పమని సర్కారీ ఆఫీసుల చుట్టూ ఎనిమిదేళ్లుగా తిరిగాడు.
అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన రాలేదు. దీంతో పాకిస్థాన్ జెండా ఎగరేశాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి, పాకిస్థాన్ జెండాను ఇంట్లో ఉంచుకున్నాడని, మతం పేరిట సమాజంలోని పలు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపిస్తున్నాడని కేసులు పెట్టారు. అయితే తాను అధికారులకు తన సమస్యను చెప్పే ప్రయత్నంలో వారి దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే ఈ పనిచేశానని చెబుతున్నాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి