మంచినీటి పైపు లైన్ పనులను మంత్రి ప్రారంభించి వెళ్లిన కొన్ని నిమిషాలకే ఆ పైపులైన్ పగిలిపోయింది. ఈ సంఘటన హైదరాబాదు శివారు ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్ హిల్స్ లో జరిగింది. సుమారు రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టిన మంచినీటి పైపు లైన్ పనులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కలిసి ప్రారంభించారు.
అయితే, ప్రజాప్రతినిధులు వెళ్లిన కొన్ని నిమిషాలకే ఆ పైపులైన్ పగిలిపోవడంతో నీరు వృథాగా పోయింది. ఈ సంఘటనపై స్థానికులు స్పందిస్తూ పనుల్లో నాణ్యత లేకపోవడం, నాసి రకపు పైపులు వాడటమే కారణమని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, పనులు ప్రారంభించి వెళ్తున్న మంత్రి కాన్వాయ్ ను.. నాలాలను కబ్జా చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే, పోలీసులు వారిని నిలువరించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి