బెదిరించి డబ్బు వసూలు చేయడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా... ప్రధాన కార్యకలాపాలుగా వేల కోట్ల నేర సామ్రాజ్యానికి డాన్ గా ఎదిగిన భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా మోసపోయాడు. ముంబై బాంబు పేలుళ్ల తర్వాత పాకిస్థాన్ కు పారిపోయి కరాచీలో తలదాచుకుంటున్న అతడిని మోసం చేసింది వేరెవరో కాదు... అతడికి నమ్మినబంటుగా ఉన్న అతడి ముఖ్య అనుచరుడేనట!
ఇక ఈ మోసం విలువ రూ.40 కోట్లట. వివరాల్లోకెళితే... ఢిల్లీలో దావూద్ కు ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్న ఖాలిఖ్ అహ్మద్... డాన్ పేరు చెప్పి ఓ వ్యాపారి నుంచి రూ.40 కోట్ల మేర నిధులు సేకరించాడు. సదరు డబ్బును డాన్ కు పంపేందుకు అతడు సదరు వ్యాపారి వద్ద రూ.5 కోట్ల మేర కమిషన్ కూడా తీసుకున్నాడట. ఆ తర్వాత హవాలా మార్గం ద్వారా ఢిల్లీ నుంచి తరలివెళ్లిన రూ.40 కోట్లు దావూద్ ను చేరలేదు.
విచిత్రంగా ఈ మొత్తం నగదుతో పాటు ఖాలిఖ్ కూడా అదృశ్యమయ్యాడు. దీనిపై తన మరో అనుచరుడు డాన్ కు ఫిర్యాదు చేయగా, దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఇద్దరు అనుచరులను డాన్ రంగంలోకి దింపాడట. ఈ మేరకు ఖాలిఖ్, పాక్ లో దావూద్ కు ముఖ్య అనుచరుడిగా ఉన్న జబీర్ మోతీకి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్లో ఈ విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం మణిపూర్ లో ఉన్నాడని భావిస్తున్న ఖాలిఖ్ తానేమీ తప్పు చేయలేదని జబీర్ తో వితండ వాదన కూడా చేశాడని భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి. సదరు మొత్తాన్ని ఫ్రీజ్ చేసే క్రమంలో దర్యాప్తు సంస్థలే ఈ పని చేసి ఉంటాయని అతడు వాదించాడట.
ఇదిలా ఉంటే... ఈ 40 కోట్లలో సగం మొత్తాన్ని ఖాలిఖ్ పనామాలోని బ్యాంకులకు తరలించినట్లు సమాచారం. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే... దావూద్ పేరిట వసూలు చేసిన సదరు మొత్తంలోని మిగిలిన సగభాగాన్ని ఖాలిఖ్.. దావూద్ కు చెందిన అంతర్జాతీయ వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టాడట.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి