ఇండియాలో రిటైల్ స్టోర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రిటైల్ స్టోర్ల సంఖ్య 1.6 కోట్లకు చేరగా, ప్రతి 15 కుటుంబాలను నమ్ముకుని ఓ స్టోర్ నడుస్తున్నట్లయింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 6వ ఎకనామిక్ సెన్సస్ గణాంకాలు వెల్లడి కాగా, రెండో స్థానంలో కోటికి పైగా యూనిట్లతో మాన్యుఫాక్చరింగ్ సెక్టారు నిలిచింది. ఇదే సమయంలో రిటైల్ షాపుల్లో 2.7 కోట్ల మంది ఉపాధిని పొందుతుండగా, మాన్యుఫాక్చరింగ్ రంగంలో 3 కోట్ల మందికి పైగా ఉపాధిని పొందుతున్నారు. ఆ తరువాతి స్థానాల్లో రవాణా రంగంలోని కంపెనీలు, గిడ్డంగులు, హోటల్స్, చిరుతిండి దుకాణాలు, ఆరోగ్య రంగం అత్యధిక యూనిట్లను, ఉపాధిని కల్పిస్తున్నాయి. ఆపై విద్యా రంగంలో 20 లక్షల స్కూళ్లు, ఇనిస్టిట్యూట్ లు పనిచేస్తూ, ఆర్థిక రంగానికి ఊతం ఇస్తున్నాయని వెల్లడైంది.
దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో 5.8 కోట్ల సంస్థలు, వాటి యూనిట్లు పనిచేస్తుండగా, 13 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోంది. 2005లో ఎకనామిక్ సెన్సస్ నిర్వహించగా, అప్పటి నుంచి తాజా లెక్కలు తేల్చే నాటికి నిర్మాణ రంగం 27 శాతం వృద్ధిని సాధించింది. వ్యవసాయేతర రంగాన్ని పరిశీలిస్తే 1.8 కోట్ల సంస్థలు, వాటి అనుబంధ యూనిట్లు 3.2 కోట్ల మందికి ఉపాధిని అందిస్తున్నాయి. రిటైల్ వాణిజ్య విభాగంలో 25 శాతం యూనిట్లు ఒక కుటుంబ అధీనంలో నడుస్తుండగా, 17 శాతం వరకూ ఎలాంటి విధానం లేకుండా సాగుతున్నాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి