భారత్ తో మరింత స్నేహపూర్వక బంధాన్ని ఏర్పరచుకోవాలన్న ఉద్దేశంతో ఏ విధమైన ఆర్థిక లాభాపేక్ష లేకుండా సెర్చ్ అండ్ రెస్క్యూ ఎయిర్ క్రాఫ్ట్ షిన్మవ్యా యూఎస్-2 విమానాలను విక్రయించాలని జపాన్ భావిస్తోంది. మొత్తం 1.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,700 కోట్లు) విలువైన డీల్ లో భాగంగా విమానాల ధరను మరింతగా తగ్గించాలని జపాన్ నిర్ణయించింది. అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ, సోదాలు జరపగల ఈ తరహా 12 ఎయిర్ క్రాఫ్ట్ లను భారత్ కు విక్రయించేందుకు తాము లాభాన్ని వదులుకోనున్నట్టు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఈ డీల్ కుదిరితే ఇరు దేశాల మధ్యా ఉన్న చైనాకు, జపాన్, భారత్ స్నేహంపై గట్టి సంకేతాలు పంపినట్లవుతుందని వారు తెలిపారు. ఈ విమానాల ధరపై ఇండియా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిందని, వాటిని నివృత్తి చేయడంతో పాటు ధరను సైతం తగ్గించనున్నామని జపాన్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ టోక్యోలో పర్యటించనున్నారన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ఆ సమయంలో విమానాల విక్రయ డీల్ పూర్తవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, 1967 నుంచి 2014 వరకూ ఆయుధాలు, విమానాల ఎగుమతులపై జపాన్ స్వీయ నిషేధం విధించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కుదిరితే, నిషేధాన్ని తొలగించుకున్న తరువాత, జపాన్ తో డీల్ కుదుర్చుకునే తొలి దేశంగానూ ఇండియా నిలుస్తుంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి