ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో పురుషల కంటే వీరు మూడు రెట్లు అధికంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 15-30 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ ఘటనలకు పాల్పడుతున్నారట.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంటే ప్రతీ 40 సెకెన్లకు ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక భారతదేశం విషయానికి వస్తే పురుషల కంటే మహిళలు 2.5-3శాతం రెట్లు ఎక్కువగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. అయితే ప్రాణాలు కోల్పోతున్న వారిలో మాత్రం మహిళల కంటే పురుషులు మూడు రెట్లు అధికంగా ఉన్నారు. 10-15 శాతం మంది మాత్రం క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. మరికొందరు మాత్రం ‘‘నేనిక జీవించడానికి పనికిరాను’’ అని ఊహించుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువమంది ఇలాగే భావిస్తున్నారట. అటువంటి వారిని సకాలంలో గుర్తించడం వల్ల వారి ప్రాణాలు కాపాడవచ్చని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ జి.ప్రసాద్‌రావు తెలిపారు.
1947లో స్థాపించిన ఈ సొసైటీ ఆత్మహత్యల నివారణకు ఎంతగానో కృషి చేస్తోంది. ఆత్మహత్యల వెనక ఉన్న కారణాల గురించి వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతోంది. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం కారణంగా ఆదివారం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
More Telugu News
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!