దుర్గంధ పూరితంగా తయారైన గుజరాత్‌ను సందర్శించేందుకు రావాలంటూ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను ఆహ్వానించేందుకు ఉనా దళిత్ అత్యాచార్ లాదత్ సమితి(యూడీఏఎల్ఎస్) ఆధ్వర్యంలో దళితులు సిద్ధమయ్యారు. ‘‘కుష్బూ గుజరాత్ కి’’, కుచ్ దిన్ తో గుజారియే గుజరాత్ మే’’ అనే ట్యాగ్ లైన్స్‌తో ఆ రాష్ట్ర పర్యాటక శాఖను ప్రమోట్ చేస్తున్న బిగ్‌బీని రాష్ట్రంలోని అసలు దుస్థితిని చూడాల్సిందిగా వేలాది పోస్టు కార్డులు రాసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. ఈనెల 13న నిర్వహించనున్న బహిరంగ సభ అనంతరం వేలాదిమంది దళితులు అమితా బచ్చన్‌ను గుజరాత్‌కు ఆహ్వానిస్తూ లేఖలు రాయనున్నట్టు యూడీఏఎస్ఎస్ కన్వీనర్ జిగ్నేష్ మేవాని పేర్కొన్నారు.
‘‘ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు బచ్చన్ అందమైన గుజరాత్ అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు దళితులను జంతు కళేబరాలను తొలగించేందుకు అడ్డుకుంటుండడంతో రాష్ట్రం కంపుకొడుతోంది. ఆయన(బచ్చన్) ఇక్కడికి వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండి గుజరాత్ దుర్గంధాన్ని చూడాలి’’ అని మేవాని పేర్కొన్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి