భారతీయులు ఇటీవల కాలంలో తెగ తాగేస్తున్నారట. అయితే తాగుడు విషయంలో మాత్రం చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారట. లైట్ విస్కీ, క్రాఫ్ట్ బీర్ల సేల్స్ పెరగడమే ఇందుకు పెద్ద ఉదాహరణ అని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. రమ్, ఓడ్కాలను విడిచిపెట్టి విస్కీ వైపు యువకులు మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది. 2014-15లో రమ్, ఓడ్కాల సేల్స్ గణనీయంగా తగ్గిపోగా విస్కీ సేల్స్ మాత్రం పెరిగింది. మారుతున్న కాలంతోపాటు వారి టేస్ట్‌లో క్రమంగా మార్పు వస్తోందని సర్వే పేర్కొంది. విస్కీ, బీర్ అమ్మకాలు పెరగడానికి ఇదే కారణమని తెలిపింది.
యువకులు ఇటీవల ‘టకీలా’ అనే మద్యం వైపు చూస్తున్నారు. 2014-15లో వీటి అమ్మకాలు పదిశాతం పెరిగాయి. ‘‘గతంలో యువకులు ఎక్కువగా ఫ్రెండ్స్‌తో కలిసి విస్కీ, రమ్ తదితర వాటిని తీసుకునేవారు. అయితే తాము తాగినట్టు తెలిస్తే ఇంటి వద్ద తిడతారనే ఉద్దేశంతో ఇటీవల రూట్ మార్చారు. విస్కీ, రమ్ తదితర వాటికి బదులు వైన్, క్రాఫ్ట్బీర్లాంటివి తీసుకుంటున్నారు’’ అని ఇండియన్ వైన్ కంపెనీ ఫ్రాటెల్లీ వైన్స్ డైరెక్టర్ కపిల్ షేఖ్రీ పేర్కొన్నారు. ఇక వైన్లలో లైట్ వైన్ అమ్మకాలు 2014-15లో 17 శాతం పెరిగాయి. మామూలు ఓడ్కా అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉన్న వాటి జోలికి పోకుండా కాస్తంత తక్కువ ఉన్న డ్రింక్స్వైపు మందుబాబులు మొగ్గుచూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి