తెలుగు నేలపై మరో భారీ మోసం వెలుగు చూసింది. చైనాలో తయారయ్యే వాహనాల విక్రయం కోసం డీలర్ షిప్పులను ఇస్తానని చెప్పిన ఓ నయ వంచకుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పదుల సంఖ్యలో వ్యాపారుల నుంచి వందలాది కోట్లు సేకరించాడు. ఆపై వాహనాలను అందించకుండానే ఉడాయించాడు. ఈ క్రమంలో మోనపోయామంటూ బాధిత వ్యాపారులు పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టారు. వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ నయ వంచకుడిపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు రంగంలోకి దిగిన తెలంగాణ సీసీఎస్ పోలీసులు మోసగాడిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకెళితే... శివకుమార్ అనే వ్యక్తి ‘ఐదర్ మోటార్స్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అత్యధిక సామర్థ్యంతో కూడిన వాహనాలను అతి తక్కువ ధరకే అందిస్తున్న చైనా కంపెనీలకు చెందిన వాహనాల విక్రయాల కోసం డీలర్ షిప్పుల కోసం ప్రకటనలిచ్చాడు. చైనా వాహనాలనగానే క్యూ కట్టిన పలువురి వద్ద కోట్లాది రూపాయలను డిపాజిట్ చేయించుకున్న శివకుమార్ ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. జరిగిన మోసంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న శివకుమార్ ను విచారిస్తున్న పోలీసులు... అతడు నెరపిన దందాను వెలికి తీసే యత్నం చేస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి