అల్లర్లతో అట్టుడుకుతున్న కశ్మీర్‌కు వచ్చే 48 గంటల్లో వేలాదిమంది సైనికులు తరలివెళ్లనున్నారు. దక్షిణ కశ్మీర్లో గత రెండేళ్ల నుంచి సైనిక బలగాలను ఉపసంహరిస్తున్న కేంద్రం తాజాగా మరింతమంది సైనికులను కశ్మీర్లో మోహరించాలని నిర్ణయించింది. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ హతమై రెండు నెలలు గడిచిన తర్వాత కూడా అక్కడ అల్లర్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కశ్మీర్లో తిరిగి శాంతిస్థాపనకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కేంద్రం కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున సైనికులను తరలించాలని భావిస్తోంది.
కశ్మీర్ యువత ఇప్పటికీ వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలపై రాళ్ల దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. వారి వెనుక పాకిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉందని భద్రతాధికారులు పేర్కొన్నారు. తిరుగుబాట్లు, పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. సైనిక బలాలను పెద్ద ఎత్తున మోహరించాలనుకోవడం వెనక ఉన్న ఉద్దేశం ఇదేనని వారు స్పష్టం చేశారు. ‘‘చొరబాటుదారులను అడ్డుకునేందుకు సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశాం. ఇప్పుడు ఆందోళనకారులపై దృష్టి సారించి ఆయా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాం’’ అని మిలటరీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది చొరబాట్లు జరిగాయని, అలాగే ఎక్కువమంది తీవ్రవాదులను మిలటరీ మట్టుబెట్టిందని ఆయన పేర్కొన్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి