ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ అవార్డు గ్రహీతలను ఇక ప్రజలే నిర్ణయిస్తారు. అర్హులను వారే నామినేట్ చేస్తారు. ఈ మేరకు కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సమాజానికి సేవలందించిన, విజయాలు సాధించి పెట్టిన వారి పేర్లను ఇక నుంచి ప్రజలే నేరుగా నామినేట్ చేసే అవకాశం కల్పించింది. పైరవీలకు తావు లేకుండా, అవార్డుల ఎంపికలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా రాష్ట్రప్రభుత్వాలు పద్మ పౌరపురస్కారాల కోసం సిఫార్సులు చేస్తూ అర్హుల పేర్లతో కూడిన జాబితాను పంపిస్తాయి. కేంద్రం తుది నిర్ణయం తీసుకుని భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తుంది. అయితే ఇక నుంచి ప్రతి భారతీయ పౌరుడూ నామినేషన్లో పాలుపంచుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం పేర్కొన్న విధంగా ఆన్లైన్లో అర్హుల పేర్లను నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే నామినేట్ చేసే వారు తమ ఆధార్ వివరాలను పేర్కొనాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా అర్హులు అనిపించిన వ్యక్తుల పేర్లను నామినేట్ చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నామినేషన్‌కు ఈ నెల 15 చివరి తేదీ కాగా ఇప్పటికే 1700 నామినేషన్లు వచ్చాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి