మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్ రూ.1500 డిమాండ్ చేయడంతో అంత చెల్లించుకోలేని బాధితులు మృతదేహాన్ని బైక్‌పైనే తరలించిన ఘటన పలువురితో కంటతడి పెట్టించింది. గత రెండు వారాల్లో ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఇటువంటివి మూడు ఘటనలు వెలుగుచూసినా ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్లలో ఏమాత్రం మార్పు రాలేదనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.
ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లా హర్పాల్పూర్ నగ్రియా గ్రామానికి చెందిన రీస్పాల్(40) గత కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు. మంగళవారం అతడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సోదరుడు ఓంకార్ స్థానిక హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. రీస్పాల్ను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అక్కడికి తీసుకెళ్లారు. అయితే రీస్పాల్ అప్పటికే మృతిచెందినట్టు జిల్లా ఆస్పత్రి వైద్యులు చెప్పారు.
అన్న మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఓంకార్ ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్‌ను కలిశాడు. అతడు రూ.1500 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతమొత్తం అతడి వద్దలేకపోవడంతో బైక్‌పైనే అన్న మృతదేహాన్ని తీసుకెళ్లాడు. దీనిని చూసిన కొందరు గ్రామస్తులు రూ.500 ఇవ్వడంతో ప్రైవేటు అంబులెన్స్‌ను మాట్లాడి అందులో తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో శుక్రవారం వాట్సాప్‌లో ప్రత్యక్షం కావడంతో వైరల్ అయింది.ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర పాండ్యన్ మాట్లాడుతూ బాధితులు ఎవరూ ప్రభుత్వ అంబులెన్స్‌ను సంప్రదించలేదని తెలిపారు. వారు నేరుగా ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్‌తోనే మాట్లాడుకున్నారని తెలిపారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి