కావేరీ జల వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సమావేశం ఏర్పాటు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చేయడంపై రైతు సంఘాల పిలుపుమేరకు ఆ రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, చేయాల్సిన పనులపై మోదీకి లేఖ రాశారు. అందులో మీ సమక్షంలోనే జయలలితతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రోజూ 15 వేల క్యూసెక్కుల నీరు తమిళనాడుకు విడుదల చేస్తే... కావేరీ నదీ పరీవాహక ప్రాంత రైతులు నష్టపోతారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇదే అనిశ్చితి కొనసాగితే ఐటీ పరిశ్రమకు కూడా సెగ తగులుతుందని, అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా దెబ్బతగులుతుందని ఆయన హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయవద్దని రాష్ట్ర బీజేపీ శాఖ కూడా చెబుతోందని ఆయన తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండడంతో తాను సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి, అమలు చేస్తున్నానని ఆయన తెలిపారు. తమిళనాడు కంటే తమ పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన లేఖలో అంగీకరించారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి