ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రచారం కోసం నడిపించే పత్రిక 'రుమియా'లో వాయవ్య ఇంగ్లండ్ లోని షెషైర్ ప్రాంతంలో పూల వ్యాపారి స్టీఫెన్ లేలండ్ (64) ఫొటో ప్రత్యక్షమైంది. పాశ్చాత్య దేశాలలో ఇలాంటి వ్యక్తుల మీద గుంటనక్క దాడులు జరుగుతున్నాయంటూ ఇచ్చిన కథనంలో అతడి ఫొటో ప్రచురించారు. ఐఎస్ఐఎస్ కదలికలపై ఓ కన్నేసి ఉంచిన కౌంటర్ టెర్రరిజం అధికారులు వెంటనే అతనికి ఫోన్ చేశారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ ప్రసారం చేసే 'రుమియా' పత్రికలో నీ పేరు ఎందుకు వచ్చింది? వారితో నీకున్న సంబంధాలు ఏంటి? అని అడిగారు.
దీంతో బిక్కచచ్చిన స్టీఫెన్ లేలండ్...వారితో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, వారు ఆ పత్రికలో తన ఫోటో ఎందుకు అచ్చువేశారో తెలియదని, అసలు తన ఫోటో వారిదగ్గరకు ఎలా వెళ్లిందో కూడా తెలియదని వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసులు ఫోన్ చేయగానే తనకు కాళ్లు, చేతులు వణికిపోయాయని, ఏం చేయాలో తెలియలేదని, తన ఫోటో అలాంటి పత్రికలో వచ్చిందని తెలియగానే చాలా భయపడ్డానని అన్నారు. తనకు జీహాదీలతో ఎలాంటి పరిచయం లేదని ఆయన తెలిపారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి