కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయానికి బాంబు ముప్పు ఉన్నట్టు మూడు ఫోన్ కాల్స్ రావడంతో అక్కడ భద్రతాధికారులు విమానాశ్రయంలో హై అలెర్ట్ ప్రకటించారు. కోల్ కతాలోని లాల్ బజార్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ, అర్షద్ అనే వ్యక్తి మానవబాంబుగా మారి కోల్ కతా ఎయిర్ పోర్టును పేల్చేయనున్నాడని, దయచేసి స్పందించాలని పోలీసులను ప్రాధేయపడ్డాడు. అలాగే సదరు అర్షద్ ఫోన్ నెంబర్ ను కూడా ఆ వ్యక్తి పోలీసులకు ఇచ్చాడు. తరువాత కాసేపటికి మరో నెంబర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ లో ఎయిర్ పోర్టులో బాంబు పెట్టారని, కొద్దిసేపట్లో అది పేలిపోతుందని ఫిర్యాదు చేశాడు.
ఆ తరువాత ఇంకొంతసేపటికి బిందానగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన మూడో ఫోన్ కాల్ లో విమానాశ్రయంలోని కార్గో ఫ్లైట్ లో బాంబు పెట్టారని, అది ఏ క్షణమైనా పేలిపోయే అవకాశం ఉందని హెచ్చరించాడు. అప్పటికే ఎయిర్ పోర్టును స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలను రంగంలోకి దించాయి. బాంబ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రతి వ్యక్తి బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఈ ఫోన్ కాల్స్ గౌహతీ సర్కిల్ నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. వీటిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి