ఓ యువకుడిపై యువతితో ఎమ్మెల్యే దాడి చేయించిన ఘటన మహారాష్ట్రలోని థానెలో చోటు చేసుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అహ్ వద్ తన ఆఫీసుకి యువకుడిని పిలిపించి యువతితో దాడి చేయించారు. తనను ప్రేమించమని సదరు యువకుడి నుంచి తనకు వేధింపులు వస్తున్నాయని ఎమ్మెల్యేకు యువతి చెప్పింది. దీంతో యువకుడు మళ్లీ వేధింపుల జోలికి వెళ్లకుండా చేయడానికి జితేంద్ర సదరు యువకుడిని తన ఆఫీసుకి పిలిపించుకుని యువతితో దాడి చేయించారు.
ఈ ఘటనపై జితేంద్ర స్పందిస్తూ... తాను తప్పుచేసినట్టు పత్రికా విలేకరులు భావిస్తే తనను ఉరి తీయండని అన్నారు. యువకుడు వేధిస్తున్నాడంటూ తనకు ఫిర్యాదు చేసిన యువతి తన ఇంటికి సమీపంలోని మురికివాడలో నివాసముంటుందని, వేధింపులు తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని ఆయన పేర్కొన్నారు. యువతిని వేధించిన ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే జితేంద్రపై ఎటువంటి కేసు నమోదుకాలేదు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి