ఒబామాను తిట్టి, సారీ చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుట్టెరీ (71) తనదైన శైలి వ్యాఖ్యలతో మరోసారి కలకలం రేపారు. ఈసారి ఆయన ఉగ్రవాదులకు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఫిలిప్పీన్స్ లో 'అబూ సయ్యఫ్' ఉగ్రవాదులు దాడులకు పాల్పడి 15 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రోడ్రిగో డుట్టెరీ లావోస్ వెళ్తూ... తనకు తిక్క లేపవద్దని, చిర్రెత్తితే సజీవంగా తినేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. దాడులు మానుకోకపోతే ప్రజలందరి ముందూ బతికుండగానే తినేస్తానని ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్ మాఫియా నుంచి దేశాన్ని విముక్తి చేస్తానని అధికారం చేపట్టిన డుట్టెరీ, కేవలం రెండు నెలల్లోనే డ్రగ్ ఆరోపణలు ఉన్న 2,400 మందిని చంపించారు. మాజీ న్యాయవాది అయిన డ్యుటెర్టే తన విధానాలతో ఫిలిప్పైన్స్ తో పాటు ప్రపంచాన్ని కూడా విస్తుపోయేలా చేస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి