రాజస్థాన్ లోని కోటాలోని రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై బాంబు బ్యాగులు కలకలం రేపాయి. వివరాల్లోకి వెళ్తే... కోటాలోని రైల్వే స్టేషన్ లోని 1వ నెంబర్ ప్లాట్ ఫాం మీద సాయంత్రం 4:30 నిమిషాల సమయంలో రెండు బ్యాగులు అనుమానాస్పద స్థితిలో కనిపించాయి. వాటి గురించి ఆరాతీయగా వాటికి సంబంధించిన వారెవరూ లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ ను రప్పించి తనిఖీలు నిర్వహించగా, ఆ రెండు బ్యాగుల్లోనూ పేలుడు పదార్థాలు ఉన్నాయని వారు గుర్తించారు.
దీంతో బాంబ్ స్క్వాడ్ వాటిని పరిశీలించగా... అందులో 2.75 కేజీల విద్యుత్ తీగలు, డిటోనేటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ రెండింటిని వేర్వేరు బ్యాగుల్లో ఉంచినట్టు వారు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు పోలీసులు నిరాకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ముంబై నుంచి ఢిల్లీకి రాజస్థాన్ మీదుగా వెళ్లే రైళ్లకు కోటా రైల్వే స్టేషన్ కీలకమైనది!
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి