నిజమే... ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన అసూయకు పరాకాష్టగా నిలుస్తోంది. తనకు ముగ్గురు ఆడ పిల్లలుండగా, వదిన మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆ నగరానికి చెందిన ఓ మహిళ సహించలేకపోయింది. గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రిలోని బెడ్ పై ఉన్న 18 రోజుల వయసున్న మేనల్లుడిని ఆ అత్త రెండో అంతస్తు నుంచి కిందకు పడేసింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు వచ్చేసింది. అయితే రెండంతస్తుల నుంచి కింద పడ్డ ఆ బాలుడు నిజంగా మృత్యుంజయుడే అని చెప్పాలి. అత్త చేతి నుంచి కింద పడ్డ ఆ బాలుడు నేరుగా భూమిని తాకలేదు. మధ్యలోనే ఉన్న ఓ వలలో పడ్డాడు. బాలుడు కనిపించక ఆసుపత్రి మొత్తం వెతికిన బాలుడి కుటుంబ సభ్యులు చివరకు ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
వేగంగా స్పందించిన ఆసుపత్రి సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టగా... ఆసుపత్రి బయట గాలిలో వేలాడుతున్న వలలో ఆ బాలుడు సజీవంగా ఉండటాన్ని ఆసుపత్రి వార్డుబాయ్ గమనించాడు. వెంటనే అక్కడికి ఎలాగోలా చేరుకున్న వార్డుబాయ్ ఆ బాలుడిని క్షేమంగా బెడ్ పైకి చేర్చాడు. ఈ క్రమంలో తన కాలికి బలమైన గాయమైనా ఆ వార్డు బాయ్ బాలుడిని కాపాడాడు. ఇక ఆసుపత్రి బెడ్ పై ఉన్న బాలుడు వలలో ఎలా పడ్డాడన్న కోణంలో ఆరా తీసిన ఆసుపత్రి సిబ్బంది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నోరెళ్లబెట్టారు. బాలుడిని కింద పడేసింది స్వయానా అతడి అత్తేనని తెలుసుకుని వారు షాక్ కు గురయ్యారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి