ప్రభుత్వోద్యోగుల్లో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో తెలియజేసే ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఆ రాష్ట్రానికి చెందిన అజిత్ కుమార్ తండ్రి రైతు. గత ఏడాది ఫిబ్రవరిలో కిడ్నీ వ్యాధితో ఆయన మృతిచెందాడు. దీంతో ఆయనకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందని, దాంతో కొన్ని కష్టాలు తీరుతాయని అజిత్ తల్లి భావించి, పరిహారం కోసం ఆమె అధికారుల చుట్టూ తిరుగుతోంది. వచ్చే పరిహారం 12,500 రూపాయలు కాగా, దీని కోసం దరఖాస్తు చేసే సమయంలో మూడు వేల రూపాయలు లంచంగా చెల్లించింది. దీంతో అధికారులు ఆమె కుటుంబానికి పరిహారం మంజూరు చేశారు.
అయితే, ఈ మొత్తం వారికి అందాలంటే తనకు 3,000 రూపాయలు చెల్లించాలని వీఏవో ఎం.కున్నతూర్ వారికి స్పష్టం చేశాడు. దీంతో అజిత్ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో అజిత్ కుమార్ వినూత్నంగా ఆలోచించి, వీఏవోకు 3,000 రూపాయలు లంచం ఇవ్వాలని, అలా ఇస్తే తమకు పరిహారంగా 12,500 రూపాయలు వస్తాయని పేర్కొంటూ ఓ బ్యానర్ తయారు చేసి భిక్షాటనకు కూర్చున్నాడు. దీంతో గ్రామస్తులంతా వీఏవో నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉన్నతాధికారులకు చేరడంతో అతనిని విధుల నుంచి సస్పెండ్ చేసి, అజిత్ కుమార్ కుటుంబం ఖాతాలో డబ్బు జమచేశారు. దీంతో అజిత్ ను అభినందించారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్