హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వానీని అమరవీరుడిగా ప్రకటించి, 19వ తేదీని బ్లాక్ డేగా ప్రకటించడం వెనుక ప్రజల నుంచి వచ్చిన భావోద్వేగాల ఒత్తిడి ఉందని, పాక్ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి రియాజ్ హుస్సేన్ ఖోఖర్ వ్యాఖ్యానించారు. వానీ ఎన్ కౌంటర్ అనంతరం తాము పెద్దగా స్పందించలేదని, అయితే, ప్రజలు, మీడియా నుంచి వచ్చిన ఒత్తిడితో, కల్పించుకోవాల్సి వచ్చిందని అన్నారు.
"పరిస్థితులను చేదాటి పోనీకుండా చూడాల్సి వుంది. అయితే, అది భారత్ ఎలా స్పందిస్తుందన్న విషయంపైనే ఆధారపడివుంది. కాశ్మీర్ లోయలో పరిస్థితిని మేము అనుకూలంగా మార్చుకోవాలని చూడటం లేదు. జరుగుతున్న ఘటనలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేయాలన్నదే మా అభిమతం. మావైపున్న ప్రతి కాశ్మీరీ బుర్హాన్ ను అమరవీరుడిగానే భావిస్తున్నారు" అని అన్నారు. కాగా, బుర్హాన్ కాల్చివేత తరువాత, జరుగుతున్న అల్లర్లు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కంటిమీద నిద్ర లేకుండా చేస్తుండగా, పలు ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి