ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం రెండో రోజు చైనా పర్యటన ఫలవంతమైంది. మొత్తం రూ. 54 వేల కోట్ల విలువైన పెట్టుబడులు నవ్యాంధ్రకు వచ్చేలా వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. దొనకొండలో రూ. 43 వేల కోట్ల అంచనా వ్యయంతో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు అవగాహనా ఒప్పందం కుదిరింది. చైనా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ తో కుదిరిన ఒప్పందం మేరకు మూడు దశల్లో ఈ పార్కు నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పార్కు నిర్మాణం జరిగితే 55 వేల మందికి ఉపాధి లభ్యం కానుంది. మొదటి దశలో రూ. 10,106.2 కోట్లు, రెండవ దశలో రూ. 12, 127.6 కోట్లు, మూడో దశలో రూ. 14,148.8 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. తొలిదశ పూర్తయితేనే 10 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అధికారులు వివరించారు.
రూ. 10 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో కృష్ణపట్నం వద్ద ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం డీల్ కుదుర్చుకుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి విదేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ఎతిహాద్ ముందుకు వచ్చింది. ఈ మేరకు విమాన సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర అధికారులు సంతకాలు చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా ఈ పర్యటనకు వచ్చామని, సాధ్యమైనన్ని ఎక్కువ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువెళ్లడమే తమ ఉద్దేశమని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చలు జరుపుతూ రోజంతా బిజీగా గడిపారు. చంద్రబాబు బృందం నేడు టియాంజిన్ నుంచి గుయాంగ్ నగరానికి వెళ్లనుంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి