పొట్టకూటి కోసం సౌదీ వలస వెళ్లిన దాదాపు 4,500 మంది భారతీయులు కంపెనీ నిర్వాకంతో అక్కడ చిక్కుకుపోయారు. వీరిలో 200 మంది హైదరాబాదీయులు ఉన్నారు. వీరంతా సౌదీ బిన్‌లాడెన్ గ్రూప్(ఎస్బీజీ) అనే నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్నారు. గత ఆరు నెలలుగా కంపెనీ వేతనాలను చెల్లించకపోవడంతో తిండీతిప్పలు లేక, స్వదేశం తిరిగి రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో ఎక్కువశాతం మంది ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఉన్నారు.
రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను తిరిగి స్వదేశం చేర్చాలని బాధితులు అభ్యర్థిస్తున్నారు. ఆరు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని, అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్బీజీ గ్రూపు నిర్మించిన బ్రిడ్జి కూలిపోవడంతో ఆ కంపెనీ కాంట్రాక్టును ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో చాలామంది కార్మికులను కంపెనీ పనినుంచి తీసేసింది. అంతేకాక వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి పాస్‌పోర్టులు లేబర్ కాంట్రాక్టర్ల వద్ద ఉండిపోవడంతో స్వదేశం రాలేక అక్కడే ఉండలేక సతమతమవుతున్నారు. దాదాపు 200 మంది హైదరాబాదీయులు ఇక్కడ చిక్కుకుపోయారని, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఈ విషయంలో చొరవ తీసుకుని తమను రక్షించాలని హైదరాబాద్ కార్మికులు వేడుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు విదేశాంగ శాఖ స్పందించలేదు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి