ప్రముఖ సినీ నటుడు, జేవీ సోమయాజులు సోదరుడు జేవీ రమణమూర్తి (84) అంత్యక్రియలు ఈరోజు హైదరాబాదులోని పంజాగుట్ట శ్మశానవాటికలో పూర్తయ్యాయి. రెండు రోజుల క్రితం ఆయన బంజారాహిల్స్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి అమీర్‌పేటలోని స్వగృహానికి తరలించారు. సినీ నటులు, అభిమానులు, రమణ మూర్తి బంధువులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని ఆయనకు నివాళులర్పించారు. 150 సినిమాల్లో నటించిన ఆయన సేవలను, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈరోజు ఆయన భౌతిక కాయాన్ని పంజాగుట్టలోని శ్మశానవాటికకి తరలించి, అంత్యక్రియలు పూర్తి చేశారు. రమణమూర్తి కుమారులు అరుణ్‌కుమార్, హర్షవర్దన్ ఆయన భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.