రెండంతస్తుల పైనుంచి కిందపడితే ఏమవుతుంది. ఎముకలు నుజ్జు నుజ్జు అవుతాయి. క్షణాల్లోనే ప్రాణం పోతుంది. కానీ ఆశ్చర్యకరంగా ఓ చిన్నారి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమెను చూసిన వైద్యులే ఆశ్చర్యపోతున్నారు. బెంగళూరులో జరిగిందీ ఘటన. 19 నెలల తనీషా తన ఇంటిలోని బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. కింద అచేతనంగా పడి ఉన్న పాపను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు తనీషా ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని, తలపై చిన్నగాయం అయిందని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
25 అడుగుల ఎత్తునుంచి కిందపడిన చిన్నారి ప్రాణాలతో బయటపడడం అద్భుతమని ఆమెకు వైద్యం చేసిన పీపుల్ ట్రీ ఆస్పత్రి వైద్యుడు సుమన్ చెప్పారు. శరీరంపై ఆమెకు ఎటువంటి గాయాలు లేవని, పుర్రె భాగంలో చిన్న గాయం అయితే సర్జరీ చేశామని వివరించారు. పాప కిందపడిందన్న వార్త తెలిసి ఒక్కసారిగా తన గుండె ఆగిపోయినంత పనయిందని, అయితే స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి ఆమె తప్పించుకున్నట్టు ఆస్పత్రికి వెళ్లాక తెలిసిందని తనీషా తండ్రి మహేంద్ర ఆనందంగా చెప్పారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి