విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత మరో వివాదంలో చిక్కుకున్నారు. గీత పీఏగా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్, ఆయన బంధువు విజయ్ కుమార్ పై నిన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తిని మోసం చేయడమే కాకుండా బాధితుడిని కులం పేరిట వీరిద్దరూ దూషించారట. దీంతో బాధితుడు సాగర్ విశాఖ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ప్రదీప్ కుమార్, విజయ్ కుమార్ లపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 506 ప్రకారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.