రెండు నెలల క్రితం మధ్యప్రదేశ్ లో సుప్రీంకోర్టు జడ్జిల నాలుగో సదస్సును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఏప్రిల్ 16 నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు జడ్జిలతో పాటు వారి భార్యలు కూడా పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ సహా సుమారు 240 మంది హాజరయ్యారు. వీరిని ప్రభుత్వ అతిథులుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా వారి భోజనాల కోసం ఏకంగా వెండి పాత్రలను కొనుగోలు చేసింది. వాటి కొనుగోలుకు రూ.3.57 లక్షలు, ఆహార పదార్థాల కోసం రూ.3.37 లక్షలు ఖర్చు చేసింది.
అంతే కాకుండా అతిథులకు బహుమతులు కూడా అందజేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ సామాజిక ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా అజయ్ దూబే అనే వ్యక్తి సేకరించాడు. అతిథులకిచ్చేందుకని వెండి పాత్రలను ప్రత్యేకంగా కొనుగోలు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి