మీరా వశిష్ట్... వయసు 13 సంవత్సరాలు. టెక్సాస్ పరిధిలోని సుగర్ ల్యాండ్ లో సర్తార్టియా మిడిల్ స్కూల్ లో ఏడవ తరగతి చదువుతోంది. ఇండియాలో విద్యుత్ ను ఆదా చేసేందుకు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ఆలోచనను గురించి తెలుసుకున్న మీరా, తన వంతు సాయం చేయాలని భావించి నిధులను సమీకరించింది. ఏకంగా రూ. 1.4 లక్షలను సేకరించి వాటితో ఎల్ఈడీ బల్బులను కొనుగోలు చేసి వాటిని పేదలకు పంచాలని చెబుతూ, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) కు లేఖ రాసింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ కు తెలిపింది.
ఆమె సమీకరించిన డబ్బుతో 1600 ఎల్ఈడీ బల్బులను కొనుగోలు చేసి పేదలకు వచ్చే నెలలో పంచనున్నామని, ఆ కార్యక్రమానికి మీరా సైతం హాజరవుతుందని ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ వెల్లడించారు. ఇండియాలో మొత్తం 11.7 కోట్ల ఎల్ఈడీ బల్బుల అవసరం ఉందని, మార్చి 2019 నాటికి సంప్రదాయ బల్బులను పూర్తిగా తొలగించి ఎల్ఈడీలను అమర్చాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం ఆలోచనలను తెలుసుకున్న తాను, ఎలాగైనా సహాయపడాలన్న ఆలోచనతో నిధులను సమీకరించాలని భావించానని, మొత్తం 2,079 డాలర్లను సేకరించానని మీరా చెబుతోంది. ఢిల్లీకి వెళ్లి, ఎల్ఈడీలను పేదలకు పంచడంతో పాటు తన పూర్వీకుల గ్రామమైన పంజాబ్ లోని ఫగ్వారాను సందర్శిస్తానని మీరా సంబరంగా చెబుతోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి