ఎస్కార్ట్ సేవల పేరిట వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ, విటులకు, సెక్స్ వర్కర్లకు మధ్య వారధిగా పనిచేస్తున్న 240 వెబ్ సైట్లపై తక్షణం నిషేధాన్ని అమలు చేయాలని ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ లో అశ్లీలతను, అసభ్యతను తొలగించే చర్యల్లో భాగంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2009 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఎస్కార్ట్స్ సేవలందిస్తున్న పీంకీ సింగ్ డాట్ కామ్, జాస్మిన్ ఎస్కార్ట్స్ డాట్ కామ్, పాయల్ మల్ హోత్రా డాట్ ఇన్, లోకల్ ఎస్కార్ట్స్ డాట్ ఇన్, పెరల్ పటేల్ డాట్ ఇన్, కావ్యా జైన్ డాట్ ఇన్, ఎక్స్ ముంబై డాట్ ఇన్, షిమీ డాట్ ఇన్, అన్చూ డాట్ ఇన్ తదితర వెబ్ సైట్ల పేర్లు ఉదహరిస్తూ, మొత్తం 240 వెబ్ సైట్లను నిలిపివేయాలని ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్)లకు ఐటీ శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
కాగా, ఈ నిర్ణయంతో ఇంటర్నెట్ మాధ్యమంగా జరిపే వ్యభిచారాన్ని ఎంతమాత్రమూ అడ్డుకోలేమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం ఎస్కార్ట్స్ పేరిట మాత్రమే కాకుండా, మసాజ్, బ్యూటీ, పర్సనల్ సర్వీసెస్, ఉమెన్ లుకింగ్ మెన్, కాజువల్ ఎన్ కౌంటర్ వంటి ఎన్నో పేర్లతో వందలాది వెబ్ సైట్లలో ఉన్న ఈ తరహా కంటెంట్ ను తొలగించడం అంత సులువేమీ కాదని నిపుణులంటున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి