ఇండియా పట్ల పాకిస్థాన్ వైఖరి ఎలా ఉన్నా, ఆ దేశాన్ని శత్రుదేశంగా తాము భావించడం లేదని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరోసారి నిరూపించింది. పొరపాటున పాక్ నుంచి తప్పిపోయి భారత భూభాగానికి వచ్చి దొరికిపోయిన ముగ్గురు మైనర్ బాలురకు చాక్లెట్లు, ఇతర కానుకలు ఇచ్చి తిరిగి వారి దేశానికి పంపి, పాక్ కు ఓ సరికొత్త పాఠం చెప్పారు మన జవాన్లు. ఈ ఘటన అమృతసర్ జిల్లా అజ్నాల పట్టణ సమీపంలో జరిగింది.
తమ బంధువుల ఇంటికి బయలుదేరిన అమీర్ (15), నోమిన్ అలీ (14), అర్షద్ (12)లు దారితప్పి నిన్న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇండియా పరిధిలోకి వచ్చారు. "ఈ ముగ్గురు బాలలు పొరపాటున ఇండియాలోకి వచ్చారు. మా జవాన్లు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారికి ఈ ప్రాంతం ఇండియాదని తెలియదు" అని 70 బీఎస్ఎఫ్ బెటాలియన్ కమాండర్ సీపీ మీనా వెల్లడించారు.
వీరి చొరబాటును గురించి పాక్ అధికారులకు వెంటనే తెలిపామని, వీరిని క్షేమంగా పంపిస్తామని కూడా చెప్పామని అన్నారు. "వీరు పిల్లలు. వారిలో దురుద్దేశాలు లేవు. అందుకే మేము రంజాన్ బహుమతులను వారికి ఇచ్చాం. వారు రోజంతా ఏమీ తినలేదు కూడా. ఇండియా నుంచి వారు మధురానుభూతులను వెంట తీసుకువెళ్లాలన్నది మా ఉద్దేశం" అని మీనా తెలిపారు. తమను జవాన్లు బాగా చూసుకున్నారని తొమ్మిదో తరగతి చదువుతున్న అమీర్ వెల్లడించాడు. ఎవరైనా ఇండియా నుంచి తప్పిపోయి పాక్ వైపు వస్తే, తమ ప్రభుత్వం కూడా ఇలాగే చూసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి