ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈ నెల 19న హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పఠాన్ కోట్ దాడి, ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో భారత్ లో పర్యటించేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రత్యేకించి ధర్మశాలలో ఆడే విషయంలో ఆ దేశం మీనమేషాలు లెక్కిస్తోంది.
ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం పాక్ ప్రభుత్వం పంపిన అత్యున్నత స్థాయి బృందం ధర్మశాల చేరుకుంది. భారత అధికారులతో కలిసి స్టేడియం, ధర్మశాల నగరాన్ని పరిశీలించనున్న సదరు బృందం ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ సీఎం, పోలీసు అధికారులతో చర్చించనుంది. ఈ బృందం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే... పాక్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్