ఈ హైటెక్ కాలంలో మోసాలు కూడా హైటెక్ లెవెల్ లోనే జరుగుతున్నాయి. బహుమతి వచ్చిందని చెప్పి, డబ్బులు దండుకుని, ఓ వ్యక్తిని నిలువునా ముంచిన వైనం ఇది. హైదరాబాదు, జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రి పరిసరాల్లో ఆటో నడుపుతూ జీవనం సాగించే రాజు అనే వ్యక్తికి వారం క్రితం గుర్తుతెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. హిమాలయా హెర్బల్ ఆయుర్వేదిక్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నానని ఆ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిర్వహించిన లక్కీ డ్రాలో మీ మొబైల్ ఫోన్ నెంబర్ కు బహుమతి లభించిందని చెప్పాడు. అడ్రస్ చెబితే బహుమతి పంపిస్తామని చెప్పాడు.
బహుమతి వచ్చిన తరువాత కేవలం 2,625 రూపాయలు చెల్లిస్తే మంచి స్మార్ట్ ఫోన్ మీ సొంతమవుతుందని ఆయన తెలిపాడు. తర్వాత ఆ మొబైల్ వచ్చిందని పోస్టాఫీసు నుంచి ఫోన్ రావడంతో దానిని 2,625 రూపాయలు చెల్లించి రాజు తీసుకున్నాడు. తర్వాత ఇంటికి వెళ్లి ఆ పార్సిల్ తెరిచి చూసిన రాజు షాక్ తిన్నాడు. ఎందుకంటే 2,625 రూపాయలు చెల్లించి తీసుకున్న పార్సిల్ లో 15 రూపాయల విలువ చేసే అల్లం వెల్లుల్లి పేస్టు బాటిల్ ఉంది. దీంతో మోసపోయినట్టు గ్రహించిన రాజు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్