ప్రముఖ హిందీ కవి, పద్మభూషణ్ గ్రహీత గోపాల్ దాస్ నీరజ్ నిన్న ఓ సంచలన ప్రకటన చేశారు. జాతీయ గీతంగా మనమంతా ఆలపిస్తున్న ‘జనగణమన’ గీతానికి ఆ హోదా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ లో నిన్న ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ‘జనగణమన’... ఆంగ్లేయుల పాలనను గుర్తుకు తెచ్చేదేనని వ్యాఖ్యానించిన ఆయన, ఈ కారణంగానే ఆ గీతానికి జాతీయ గీతం హోదాను రద్దు చేయాలని పేర్కొన్నారు. ‘జనగణమన’ను జాతీయ గీతంగా రద్దు చేస్తే, దాని స్థానంలో ఏ గీతాన్ని ఎంపిక చేయాలన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ‘వందేమాతరం’, 'ఝండా ఊంచా రహే హమారా’ గీతాల్లో దేనినైనా జాతీయ గీతంగా ప్రకటించుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. అసలు ‘జనగణమన’ను జాతీయ గీతంగా వద్దనడానికి ఆయన చెప్పిన కారణం ఏమిటంటే...
‘‘మనందరం బానిసలుగా ఉన్నాం. మన జాతీయ గీతం కూడా మనదేశం బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పటిదే. ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్... 1911లో యూకే రాజుగా ఐదో జార్జ్ కు పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంగా రాశారు. బ్రిటిషర్లు ఎప్పుడో వెళ్లిపోయారు. కానీ, ఇప్పటికీ కొంతమంది (ఇంగ్లీష్)కి బానిసలుగా ఉండటాన్ని కొనసాగిస్తున్నారు. వందేమాతరం గీతాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాం? వందేమాతర నినాదంతో ఎంతోమంది హిందువులు, ముస్లింలు అమరులయ్యారు. ‘జనగణమన’ గీతంలో ‘అధినాయక’ అంటే నియంత... ‘జయహే భారత భాగ్య విధాత’ అంటే, దేశ సౌభాగ్యానికి ఆయనే విధాత అని అర్థం. ‘పంజాబ సింధు గుజరాత మరాఠా’లో సింధ్ ఇప్పుడు భారత్ లో ఉందా?’’ అంటూ ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి