ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ తనను చూడటానికి వస్తే తన జ్వరం తగ్గిపోతుందంటున్న ఒక చిన్నారి మాటలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. ‘నాకు చిన్నప్పటి నుంచి హీరో పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టం. పవన్ అంకుల్ వస్తే.. నా జ్వరం పోతుంది’ అని అంటున్న ఆ చిన్నారి గురించిన వివరాలు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లోని పెదపేటకు చెందిన రత్నరాజు, రమాదేవి దంపతుల ఆరేళ్ల కూతురి పేరు నూకల కనకచంద్రదీపిక. తమ కూతురుకి నీరసంగా ఉండటంతో నెల రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల్లో చిన్నారికి బ్లడ్ కేన్సర్ అని తేలడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఈ వ్యాధి నివారణకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని, హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో చిన్నారికి వైద్యం అందించేలా ఎంపీ తోటీ సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు చర్యలు తీసుకుంటున్నట్లు చిన్నారి తల్లిదండ్రులు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వైద్య చికిత్స అందేలా వారు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఇప్పటికే తమ ఇంటిని తాకట్టు పెట్టామని, దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. అయితే.. తనకు బ్లడ్ కేన్సర్ అన్న విషయం తెలియని ఈ చిన్నారి జ్వరం వచ్చిందని అనుకుంటోంది. పవన్ కల్యాణ్ ని చూస్తే తన జ్వరం తగ్గిపోతుందని దీపిక చెబుతోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి