జమ్మూ కాశ్మీర్ లోని ప్యాంపోర్ లో నిన్న సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై మెరుపు దాడికి దిగి నలుగురి ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు... కొద్దిసేపటి క్రితం భీకర దాడి ప్రారంభించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తాజాగా ఓ ఆర్మీ కెప్టెన్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదుల దాడిలో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. నిన్న సాయంత్రం హఠాత్తుగా విరుచుకుపడ్డ ఉగ్రవాదులు... ఆత్మ రక్షణలో భాగంగా సమీపంలోని ఓ ప్రభుత్వ భవనంలోకి వెళ్లి దాక్కున్నారు. ఈ క్రమంలో భవనంలోని దాదాపు వంద మందికి పైగా విద్యార్థులను సురక్షితంగా కాపాడిన సైన్యం, ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఆ భవనం చుట్టూ మోహరించింది.
నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత కాల్పులను విరమించిన సైన్యంపై కొద్దిసేపటి క్రితం ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ చనిపోయారు. అక్కడ ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడి తరహాలోనే ఉగ్రవాదులు పెను విధ్వంసం సృష్టించేందుకే తాజా దాడికి దిగారు. ఉగ్రవాదుల కాల్పులకు దీటుగా సైన్యం కూడా కాల్పులు కొనసాగిస్తోంది. కాల్పుల మోతతో ప్యాంపోర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి