జేఎన్ యూలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆవేదనతో ఏబీవీపీ సెక్రటరీ జనరల్ ప్రదీప్ నర్వాల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామాపై మాట్లాడుతూ, జేఎన్ యూలో చేరుతానని తన తల్లిని అడిగినప్పుడు ముందు యూనివర్సిటీ గురించి అడిగారని, అప్పుడు దేశంలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో అదొకటని చెప్పానని అన్నారు. ఇప్పుడు తన తల్లి 'ఇదేనా నువ్వు చెప్పిన జేఎన్ యూ అంటే?' అని నిలదీశారని చెప్పారు. జేఎన్ యూలో ఘటనపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై నిరసనతో ఆయన, ఆయనతో పాటు మరికొంత మంది నేతలు ఏబీవీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానికి లేఖ రాశారు.
ఈ లేఖలో జేఎన్ యూ విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులను రాజకీయ అవసరాలకు వినియోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రధానిగా ఇప్పటికైనా కలుగజేసుకోవాలని ఆయన మోదీని కోరారు. తనకు తెలిసి యూనివర్సిటీ అంటే ఒక స్వతంత్ర విద్యావ్యవస్థ అని ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల బాధలు తగ్గించాల్సింది పోయి, జాతీయత పేరుతో విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. జేఎన్ యూను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా చూపే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశానని ఆయన లేఖలో స్పష్టం చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి