రిజర్వేషన్ల కోసం జాట్లు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఉదయం జింద్ జిల్లాలోని బుద్ధా ఖేర్ రైల్వే స్టేషన్ కు నిప్పు పెట్టిన నిరసన కారులు అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. రోహ్ తక్ జిల్లా వ్యాప్తంగా నిరసనల జోరు పెరిగింది. గుహానా రోడ్ లోని మూడు పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇక్కడి పెట్రోలు బంక్ లు, కమ్యూనిటీ హాళ్లు, దుకాణాలను కూడా ఆందోళనకారులు అగ్నికి ఆహుతి చేశారు. కలనోర్ లో బీడీవో కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ ప్రాంతంలో పలు బస్సులనూ దహనం చేశారు.
హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంతో పాటు పలు కాలేజీల్లో చదువుతున్న జాట్ విద్యార్థులు రహదార్లపై నిరసన ప్రదర్శనలకు దిగారు. జింద్ జిల్లాలోని 30 ప్రాంతాల్లో రహదారులపై ఏ ఒక్క వాహనమూ కదిలే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఢిల్లీ-సోనిపట్ మార్గం పూర్తిగా మూసుకుపోగా, హర్యానా నుంచి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి