ఇండియాలో ఆదాయపు పన్ను శాఖకు, ప్రభుత్వానికి ఎంతమాత్రమూ సంబంధం లేనట్టు కనిపిస్తోందని టెలికం సేవల సంస్థ వోడాఫోన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం మేకిన్ ఇండియా అంటూ ఎంత ప్రచారం చేస్తున్నా, పెట్టుబడులతో స్నేహపూర్వకంగా ఉంటామని చెబుతున్నా అవన్నీ రాతలకే పరిమితమయ్యాయని ఆరోపించింది. వోడాఫోన్ కు, ఆదాయపు పన్ను శాఖకు మధ్య వివాదం నెలకొని ఉండగా, తమకు కట్టాల్సిన 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 13,600 కోట్లు) పునరావృత పన్ను (రెట్రాస్పెక్టివ్ టాక్స్) తక్షణం చెల్లించాలని నోటీసులు పంపడంపై వోడాఫోన్ స్పందించింది.
"మాకు టాక్స్ విభాగం నుంచి నోటీసులు అందాయి. ఈ డబ్బు చెల్లించకుంటే ఆస్తులను సీజ్ చేస్తామని కూడా వారు చెప్పారు. ఈ వివాదం అంతర్జాతీయ కోర్టు పరిధిలో ఉంది. భారత ప్రభుత్వం మా కేసు సహా పలు పన్ను వివాదాలను ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాల పరిధిలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ సైతం విదేశీ ఇన్వెస్టర్లతో స్నేహపూర్వకంగా ఉంటామని చెబుతున్నారు. కానీ, ఇప్పుడీ నోటీసులు చూస్తుంటే ప్రభుత్వానికి, ఐటీ శాఖకు సంబంధాలు తెగిపోయినట్లున్నాయి" అని వోడాఫోన్ ఓ ప్రకటనలో ఆరోపించింది. కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి జైట్లీలు వివిధ సందర్భాల్లో పునరావృత పన్ను ఇండియాలో గతించిపోయినట్టేనని వెల్లడించిన సంగతి తెలిసిందే.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి