యువత ఘనంగా జరుపుకునే ప్రేమికుల రోజును ఓ యువకుడు వినూత్నంగా జరుపుకుని తన చిరకాల కోరిక తీరిందని ముచ్చటపడిపోయాడు. అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లోని స్మిత్ ఫీల్డ్ లోని ఓ పాఠశాలలో చదువుతున్న హేడెన్ గాడ్ ఫ్రే అనే యువకుడు 14 ఏళ్ల వయసులో ఉండగా స్కూల్లో ఉన్న అమ్మాయిలందరికీ వేలంటైన్స్ డే గిఫ్ట్ గా పూలను బహూకరించాలనే ఆలోచన వచ్చింది. అందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికి మూడేళ్ల పాటు వివిధ పనులు చేశాడు.
మెక్ డోనల్డ్స్ లో వంటవాడిగా పని చేశాడు. గత పది నెలలుగా మెక్సికన్ రెస్టారెంట్లో అంట్లు తోమాడు.
ఎలా అయితేనేమి, తాను అనుకున్న 450 డాలర్లు (30 వేల రూపాయలు) పోగు చేశాడు. వేలంటైన్స్ డే రావడంతో ఆ మొత్తం ఖర్చు చేసి ఖరీదైన గులాబీలను తెప్పించాడు. స్కూల్ లోని 12 మంది స్నేహితుల సాయంతో వాటన్నింటినీ సమానంగా కత్తించాడు. స్నేహితులనే వాలంటీర్లుగా చేసుకుని ఆరోజు స్కూల్ కు వచ్చిన ప్రతి అమ్మాయికి ఒక గులాబీని కానుకగా అందజేశాడు. ఇలా 834 మంది అమ్మాయిలకు ప్రేమగా పూలు ఇచ్చాడు. దీనిపై హేడెన్ గర్ల్ ఫ్రెండ్ లిలియాన్ షార్ప్ మాట్లాడుతూ, ఈ రోజు స్కూలుకి వచ్చిన ప్రతి అమ్మాయి గులాబీ పట్టుకుని ఆనందంగా ఇంటికి వెళ్లిందని తెలిపింది. ఇది తనకు చాలా నచ్చిందని పేర్కొంది. మొత్తానికి హేడెన్ గాడ్ ఫ్రే తన చిరకాల కోరికను తీర్చుకోవడమే కాకుండా ప్రియురాలి మనసు కూడా గెల్చుకున్నాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి