దేశంలో ఐటీ రంగంలోని ఉద్యోగుల వేతనాల విధానంపై మాన్ స్టర్ శాలరీ ఇండెక్స్ (ఎంఎస్ఐ) ఓ నివేదిక రూపొందించింది. అత్యధిక జీతాలు అందుకుంటున్న వారిలో మొదటిస్థానంలో ఐటీ ఉద్యోగులే ఉన్నా... వారిలో సగంమంది అసంతృప్తిగానే ఉన్నట్టు వెల్లడించింది. ఐటీ రంగ ఉద్యోగులు గంటకు సగటున రూ.346.42 అందుకుంటున్నారని, తయారీ రంగంలోని ఉద్యోగులు కనిష్టంగా సగటున రూ.254.04 తీసుకుంటున్నారని మాన్ స్టర్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ మోదీ తెలిపారు. అయితే దేశంలో అత్యధికంగా వేతనాలు చెల్లించే రంగం ఐటీ అయినా ఈ రంగంలోని 57.4 శాతం మంది ఉద్యోగులు మాత్రమే సంతృప్తిగా ఉన్నారని నివేదికలో పేర్కొంది.
ఐటీ రంగం తరువాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగం గంటకు సగటున అత్యధికంగా రూ.300.23 చెల్లిస్తూ రెండో స్థానంలో నిలిచింది. భారత్ లో ఈ రెండు రంగాలే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ రెండు రంగాల్లోని ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మందే తమ వేతనాలతో సంతృప్తిగా ఉంటున్నట్టు పేర్కొంది. అయితే మేకిన్ ఇండియా నినాదంతో ఈ రంగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినా ఉద్యోగులకు ఇంకా అవే జీతాలు అందుతున్నాయని, మాస్టర్ డిగ్రీ కలిగి ఉన్న ఉద్యోగి కూడా సగటున రూ.260.8 అందుకుంటున్నాడని వివరించింది. మరో విషయమేంటంటే, ఐటీ రంగంలోని దేశీయ కంపెనీలు చెల్లిస్తున్న దానికంటే విదేశీ కంపెనీలు ఉద్యోగులకు డబుల్ వేతనాలు ఇస్తున్నట్టు తెలిపింది. ఇదిలాఉంటే, ఉద్యోగుల అసంతృప్తికి గల కారణాలను మాన్ స్టర్ వివరించకపోవడం గమనార్హం.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి