అమానతుల్లా ఖాన్... ఢిల్లీలోని ఓఖ్లా నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే. తన పిల్లల స్కూలు ఫీజులు చెల్లించేందుకు డబ్బుల్లేని పరిస్థితి. అమానతుల్లా ఫీజు కట్టడంలో విఫలం కాగా, పిల్లల్ని స్కూలు నుంచి పంపేశారు. తనకొచ్చే జీతం చాలీ చాలకుండా ఉండటంతో, గత ఆరు నెలలుగా ఫీజు చెల్లించలేకపోయానని, దీంతో పిల్లలను పంపేశారని 'ది ఇండియన్ ఎక్స్ ప్రెస్'కు అమానతుల్లా ఖాన్ వివరించారు. "ఫీజు చెల్లించేందుకు చాలినంత డబ్బు నా దగ్గర లేదు. ఇంత తక్కువ జీతంతో జీవనం ఎలా?" అని ప్రశ్నించారు. తన ఇద్దరు పిల్లలకూ రూ. 58 వేలు కట్టాల్సి వుందని, ప్రతి నెలా తనకు రూ. 83,500 వేతనం వస్తుండగా, తన కార్యాలయ నిర్వహణకే రూ. 62 వేలు అవుతోందని అన్నారు.
కాగా, ఇటీవలే ఢిల్లీ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు వేతనాలను 400 శాతం పెంచుతూ ఆప్ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం అమలైతే అమానతుల్లా ఖాన్ కష్టాలు తీరుతాయేమో!
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి