వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటించనున్న భారత జట్టులో డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీట్వంటీలు ఆడనున్న ఆటగాళ్లను సెలెక్టర్లు ప్రకటించారు. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే, టీట్వంటీల్లో పేలవ ప్రదర్శనతో తోక ముడిచిన టీమిండియా ఆటగాళ్లకు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. టీట్వంటీ జట్టులోకి యువరాజ్ సింగ్, పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రాను ఎంపిక చేసిన సెలెక్టర్లు, వన్డే జట్టుకు రవీంద్ర జడేజా, మహ్మద్ షమిలను ఎంపిక చేశారు.
వన్డే జట్టులో గురుకీరత్ సింగ్ తన స్థానం పదిలం చేసుకోగా, ఆల్ రౌండర్ రిషి ధావన్, పంజాబ్ ఆటగాడు బ్రయిందర్ సింగ్ తొలిసారి చోటు దక్కించుకున్నారు. వన్డేల్లో సురేష్ రైనా చోటు కోల్పోవడం విశేషం. కాగా, సుదీర్ఘ విరామం తరువాత యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా జట్టులో చోటు సంపాదించుకోవడం విశేషం. ఆస్ట్రేలియా జట్టుపై యువరాజ్ సింగ్ కు మంచి ట్రాక్ రికార్డు ఉండడం, పేస్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో యువీ కీలకం కాగలడని, అతడిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనితో పాటు 2016 టీట్వంటీ ప్రపంచ కప్ కు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్ గా సెలెక్టర్లు ఎంపిక చేశారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్