నూటికి నూరు శాతం రాజకీయ కక్షే: మోదీపై రాహుల్ నిప్పులు
నేషనల్ హెరాల్డ్ కేసును ఇప్పుడు వెలుగులోకి తెచ్చి, తమను ఇబ్బందులు పెట్టాలని చూడటం, ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం నుంచి జరుగుతున్న నూరుశాతం రాజకీయ ప్రతీకారంలో భాగమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఈ మధ్యాహ్నం పార్లమెంటులో మీడియాతో మాట్లాడిన ఆయన, భారత న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఎంత సమయమైనా నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే న్యాయానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. కాగా, ఈ కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతోందే తప్ప, బీజేపీకి ఎంతమాత్రమూ ప్రమేయం లేదని పార్లమెంట్ లో వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.