వరంగల్ ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలుస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరంగల్ ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలుస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నిక విజయంపై టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందుతామని స్పష్టంగా చెప్పారు. ఈ మేరకు వరంగల్ లో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలే తమ ప్రచార అస్త్రాలని అన్నారు. ఐదుగురు అభ్యర్థుల పేర్లతో పార్టీ అధిష్ఠానం వద్దకు వెళుతున్నామని తెలిపారు. అయితే వివేక్ వైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారని చెప్పారు.

More Telugu News