వచ్చే వారం రోజుల వ్యవధిలో మీకు అవసరమనుకున్న డబ్బులను ఇప్పుడే ఏటీఎంల నుంచి తీసేసుకోండి. లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే, భారత బ్యాంకింగ్ రంగం వరుస సెలవుల 'మూడ్' లోకి వెళ్లనుంది. రేపు దుర్గాపూజ, ఎల్లుండి దసరా, మరుసటి రోజు మొహర్రం, ఆపై నాలుగో శనివారం (ప్రభుత్వ బ్యాంకులకు రెండు, నాలుగో శనివారాలు పూర్తి సెలవు), తరువాతి రోజు ఆదివారం. ఇండియాలోని అత్యధిక రాష్ట్రాల్లో ఈ ఐదు రోజుల పాటూ ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ రాష్ట్రాల్లో నేటి సాయంత్రం తరువాత ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలలో నగదు నింపిన తరువాత, తిరిగి సోమవారం నాడు మాత్రమే నగదు పెట్టేందుకు ఉద్యోగులు రానున్నారు. సాధారణంగా ఏ ప్రధాన ప్రాంతాల్లోని ఏటీఎంలలో రెండు రోజుల్లోనే నగదు అయిపోతుంటుంది. ఇక వరుస సెలవులు వస్తే...
కాగా, తెలంగాణలో నేడు సద్దుల బతుకమ్మ కారణంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించినప్పటికీ, బ్యాంకులకు సమాచారం లేదని, తెలంగాణలో వరుసగా బ్యాంకులు మూతపడటం లేదని అధికారులు తెలిపారు. 22న దసరా తరువాత, 24, 25 తేదీల్లో బ్యాంకులు పనిచేయవని ఓ అధికారి తెలిపారు. అంటే తెలంగాణలో మంగళ, బుధ, శుక్ర వారాల్లో బ్యాంకులు పనిచేయనున్నాయి. ఇక అత్యవసరంగా నగదు అవసరమయ్యే వారు రూ. 20 పెట్టి (ఇతర బ్యాంకుల నుంచి మూడు సార్లు డబ్బు తీసుకుంటే) ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలను ఆశ్రయించవచ్చని సలహా. ఎందుకంటే, ఈ బ్యాంకుల ఏటీఎంలలో శనివారం నాడు డబ్బు నింపుతారు కాబట్టి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి