పాకిస్థాన్ శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణ చేశారు. ప్రకృతి విపత్తుల్లో కమ్యూనికేషన్ లో తీవ్ర అంతరాయాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు దానికి సరికొత్త పరిష్కారం కనుగొన్నారు. సోలార్ మొబైల్ నెట్ వర్క్ ను రూపొందించారు. లాహోర్ లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూనివర్సిటీ పరిశోధకులు, అమెరికాకి చెందిన కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధక బృందంతో కలిసి పాకిస్థాన్ కోసం రెస్క్యూ బేస్ స్టేషన్ (ఆర్బీఎస్)ను రూపొందించారు. సాధారణ సెల్ ఫోన్లలో కూడా ఉపయోగించుకోగలిగే మొట్టమొదటి అత్యవసర టెలికామ్ సిస్టమ్ ఇది అని శాస్త్రవేత్తలు తెలిపారు.
విపత్తు సమయాల్లో కమ్యూనికేషన్లు పని చేయవు. అలాంటి సందర్భాల్లో ఆర్బీఎస్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సాధారణ మొబైల్ లో కూడా సిగ్నల్స్ వచ్చేస్తాయి. వీటితో కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చని వారు వెల్లడించారు. ఆర్బీఎస్ తక్కువ బరువుతో ఉండే బాక్స్ అని, దీనిలో సిగ్నల్ యాంప్లిఫైర్, యాంటెన్నా, బ్యాటరీ ఉంటాయని వారు వెల్లడించారు. బ్యాటరీ రీఛార్జ్ కావడానికి సోలార్ ప్యానెల్ ఉంటుందని వారు తెలిపారు. దీనిని వెల్లడానికి క్లిష్టమైన ప్రాంతాల్లో హెలీకాప్టర్ సాయంతో జారవిడచవచ్చని వారు పేర్కొన్నారు. విపత్తు సమయాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందని వారు వివరించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి