యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రధాని యూఏఈలోని మసీదును సందర్శించడం కంటే ముందు భారత్ లో ఉన్న ఏ మసీదునైనా సందర్శించి ఉండాల్సిందని సూచించింది. ఏఐఎంపీఎల్బీ వర్కింగ్ జనరల్ సెక్రటరీ మౌలానా మహ్మద్ వాలి రెహ్మానీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వేరే దేశంలో ఉన్న మసీదుకు వెళ్లేముందు, దేశంలో ఉన్న ఏదో ఒక మసీదుకు వెళితే బాగుండేది అని అన్నారు.
కేంద్రంలో సర్కారు మారిన తర్వాత ఓ మతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశంలోని ముస్లింలు ఇతర వర్గాలతో పోల్చితే ఆర్థికపరంగానూ, విద్య పరంగానూ వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ స్పష్టంగా చెప్పిందని, వారి అభ్యున్నతి కోసం ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కాగా, ప్రధాని మోదీ అబుదాబిలో పర్యటించిన సందర్భంగా అక్కడి విఖ్యాత షేక్ జాయేద్ మహా మసీదును సందర్శించారు. ఈ మసీదు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మసీదుగా పేరుగాంచింది. యూఏఈలో ఇదే పెద్దది. ఇస్లామిక్ ప్రపంచంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఈ మసీదును నిర్మించారు
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి