ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషితేశ్వరి ఆత్మహత్య సమయంలో ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్న బాబూరావు లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సీనియర్ విద్యార్థులతో మందు కొట్టడం, విద్యార్థినులను వేధిస్తున్న వారికి అండగా నిలవటం, తన మాట వినని వారికి మార్కులు తగ్గించడం, ప్రశ్నించిన అధ్యాపకులను తొలగించడం... ఇలా ఆయన లీలలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. 2009లో ఆర్కిటెక్చర్ కళాశాలకు రాకముందు ఆయన కృష్ణా జిల్లా అరిగిపల్లి ఎస్ఏఆర్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారట. ఆ సమయంలో మహిళా అధ్యాపకులను వేధించాడని, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు రావడంతో తొలగించారట.
గత చరిత్ర గురించి తెలుసుకోకుండానే నాగార్జున వర్శిటీలో ఆయనకు స్థానం కల్పించారు. ఆపై కూడా పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. కళాశాల బయట ఫ్రెషర్స్ పార్టీలు పెట్టడం, ఆపై మద్యం సేవించడం, ప్రిన్సిపాల్ పేరిటే బిల్లు తీసుకోవడం వంటివి ఆధారాలతో బయటపడ్డాయి. ఆయన అండ చూసుకునే రిషితేశ్వరిపై సీనియర్ల వేధింపులు జరిగాయని విచారణ కమిటీ నిర్ధారించినా, ఇప్పటికి కూడా ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదని ఇతర అధ్యాపకులు, విద్యార్థులు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి